కడప జిల్లాలోని బద్వేల్ - మైదుకూరు ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిపల్లె సమీపంలో అదుపుతప్పిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, 108 అంబులెన్స్ సహాయంతో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్షతగాత్రుల వివరాలు












