తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించే లక్ష్యంతో కొడంగల్‌లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ () కార్యక్రమంలో భాగంగా 943.34 ఎకరాల విస్తీర్ణంలో భారీ పారిశ్రామిక హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఇండస్ట్రియల్ హబ్‌కు అవసరమైన భూసేకరణ కోసం రూ.220 కోట్లు, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.441.91 కోట్లు కేటాయించారు. మొత్తం ఈ రెండు కేటాయింపులు రూ.661.91 కోట్లుగా ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటికే రెండు సంస్థలకు మొత్తం 96 ఎకరాల భూమిని కేటాయించారు. బిర్లాను లిమిటెడ్‌కు ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీ పరిశ్రమ కోసం, ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వెజిటబుల్ ఆయిల్స్ తయారీ, వ్యవసాయ పరిశోధన కార్యకలాపాల కోసం భూములు కేటాయించారు.
ఈ రెండు సంస్థలు కలిపి సుమారు రూ.252.86 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా దాదాపు 535 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెట్టుబడుల దృష్టి
ఏరోస్పేస్, రక్షణ రంగం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్టైల్స్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఈ ప్రాంతంలో అవకాశాలు కల్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 100 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులకు ఆహ్వానించారు.

