నిజామాబాద్, 12 September
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ ప్రాంతాల్లో గత ప్రభుత్వం పద్మశాలి సంఘానికి కేటాయించిన 10 శాతం భూమిని ఎవరూ విక్రయించలేదని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. పట్టణ, మండల పద్మశాలి కళ్యాణ మండపం నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రభుత్వ స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని పద్మశాలి సంఘం నాయకులకు అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి రూ.90 లక్షల నిధులు మంజూరు చేయించారని నాయకులు తెలిపారు. ఆ నిధులతో కళ్యాణ మండపం నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ, ప్రహరీ గోడ, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు సరిపోక పనులు మధ్యలో నిలిచిపోయాయని చెప్పారు. కళ్యాణ మండపం మిగతా పనులను పూర్తి చేసేందుకు పట్టణ, మండల పద్మశాలి కుల బాంధవులు కలిసి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.50 వేల చొప్పున విరాళాల రూపంలో నిధులు సేకరించి, మండపంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే క్రైమ్ నంబర్ 27 కింద పద్మశాలి కళ్యాణ మండపం వద్దకు వెళ్లి, 10 శాతం భూమి, నిధులు మంజూరు చేయించలేదని, కళ్యాణ మండపం నిర్మాణం పూర్తికాలేదని, కేటాయించిన భూమిలో కొందరు రాజకీయ నాయకులు భూమిని విక్రయించారని ఆరోపణలు చేసినట్లు పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు.
ఈ ఆరోపణలను జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటరామ్ తీవ్రంగా ఖండించారు. శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పద్మశాలి కళ్యాణ మండపం కోసం గత ప్రభుత్వం కేటాయించిన 10 శాతం ప్రభుత్వ భూమికి సంబంధించిన జీఓ కాపీని మాజీ ఎమ్మెల్యే సంఘానికి అందించారని తెలిపారు. ఆ భూమిలోనే కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టామని, నిధులు సరిపోక మిగిలిన పనులు నిలిచిపోయాయని చెప్పారు. ప్రస్తుతం అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో షేర్ రూపంలో నిధులు సమీకరించి మండపంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కేటాయించిన భూమిని ఏ రాజకీయ నాయకుడూ విక్రయించలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు సూచించారు. పద్మశాలీలు ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతున్నారని, వారి అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రసాద్, రాజేందర్, ప్రభాకర్, అశోక్, పద్మయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

