ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ.1,806 పెరిగి రూ.1,43,450కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,490గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,580గా నమోదైంది.
ధనత్రయోదశి సందర్భంగా శుక్రవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు శనివారం మళ్లీ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ.1,806 పెరిగి రూ.1,43,450కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,490గా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,580గా నమోదైంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. కొనుగోలుదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక దుకాణాల్లో తాజా ధరలను తెలుసుకోవాలని వ్యాపారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

