కొత్తగా ఏర్పడిన వీడీసీ కమిటీ సభ్యులు కుల వివక్ష చూపుతూ మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ ఆలయాల నిర్మాణానికి అభ్యంతరాలు చెబుతున్నారని వారు ఆరోపించారు.
జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ ఆలయాల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న గ్రామ వీడీసీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షుడు కొత్తోళ్ల గంగారం, గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి మల్లన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకటరాములు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితరులు మాట్లాడుతూ, గతంలో గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో ఒకే ప్రదేశంలో ఎనిమిది ఆలయాలు నిర్మించాలని తీర్మానం చేశారని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

