Mahabubabad/Mahabubabad (డాక్సిన్ టైమ్స్) జూన్ 29
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సదస్సును గతానికి భిన్నంగా, ప్రాంతీయ స్థాయిలోనూ నిర్వహించాలని సూచించారు. పెట్టుబడులు, ఎంఓయూలతో పాటు నాలెడ్జ్ షేరింగ్‌పై ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు.
విశాఖలో నవంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సదస్సు గతానికి భిన్నంగా, ప్రాంతీయ స్థాయిలో కూడా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఐఐ సదస్సుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World' అనే థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఎంఓయూలు, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో పాటు రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల డెలిగేట్స్‌ను ఆహ్వానించాలని సూచించారు.
వివిధ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని, దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని సీఎం చెప్పారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టాలని ఆదేశించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.











