కామారెడ్డి, 8 November
సొంతింటి కల నెరవేరడంతో కొత్త ఇళ్లలో తొలి దీపావళి వేడుకలను లబ్ధిదారుల కుటుంబాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలోని తిమ్మాకపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న తిమ్మక్‌పల్లి గ్రామంలో మొగిలి పద్మ, మొగిలి శ్యామల, మంగలి రాజవ్వ, మంగలి లక్ష్మి, పంగ వనిత కుటుంబాలకు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నూతన గృహప్రవేశాల అనంతరం వచ్చిన తొలి దీపావళి కావడంతో షబ్బీర్ అలీ ఆయా కుటుంబాలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల దంపతులకు స్వయంగా స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు.
గార్గుల్ గ్రామంలో సంబరాలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గార్గుల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో గడ్డం గౌతమి, కాసార్ల లయ, బొంబోతుల భారత్గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల దంపతులకు స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

