కామారెడ్డి, 8 November
జిల్లా కేంద్రంలో మాల మహానాడు సంఘం, మాల సంఘం, అంబేద్కర్ సంఘం, ఎంసిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో రోస్టర్ పాయింట్ల సవరణ కోరుతూ ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. వర్గీకరణలో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే సవరణలు చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాల మహానాడు సంఘం, మాల సంఘం, అంబేద్కర్ సంఘం, ఎంసిఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మహనీయుల విగ్రహాల వద్ద రోస్టర్ పాయింట్ల సవరణ సాధనకై ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ, మాలలందరూ కి తరలిరావాలని, ఒక్కరోజు రోస్టర్ పాయింట్ల సవరణ సాధనకై శాంతియుత నిరాహార దీక్ష చేపట్టామని, వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరిగిందని, రోస్టర్ పాయింట్ల సవరణ సరిచేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, సంఘీ రాజలింగం, ఎంసిఎఫ్ జిల్లా కన్వీనర్ చెవుల రవీందర్, ఎంసిఎఫ్ కో కన్వీనర్ సుతారి సుధాకర్, జిల్లా నాయకులు ఎడ్ల రాజు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. దీనికి రాష్ట్రంలో ఉన్న మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రోస్టర్ పాయింట్ల సవరణ చేయించాలని, లేకపోతే రాబోయే ఎన్నికలలో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దుబాసి నరేందర్, సంగయ్య, బత్తుల స్వామి, సాయి మౌర్య, యేసు రాజు, సంజీవ్, సత్యం, సూర్య, నాలుక స్వామి, కృష్ణ పాల్గొన్నారు.

