జిల్లా, ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముఠాను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రొద్దుటూరులో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్న ముఠా గుట్టును ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించగా, పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిందితుల నుంచి 56 కేజీల సిల్వర్ సర్వీస్ వైర్, 5 కేజీల కాపర్ వైర్, రూ.5,40,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో, రెండు బైకులు, ఐరన్ రాడ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, మహేష్, కిరణ్, రంగనాయకులు అనే ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ముఠాలో కీలక పాత్ర పోషించిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ మాట్లాడుతూ, గ్రామాల్లో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు కనిపించకపోయినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. విద్యుత్ ఆస్తి ప్రజల ఆస్తి అని, దాని రక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

