కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 8 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పనిమనిషి ముసుగులో దొంగతనాలు చేసిన నిందితురాలు, గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
కామారెడ్డి పట్టణంలోని ముషీరాబాద్‌కు చెందిన చిట్మల్ అనసూయ (66) ను న సాయంత్రం హత్య చేసి, ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన భర్త, అనసూయ అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటాన్ని గమనించారు. మెడపై గాయాలు, పుస్తెల తాడు, ఉంగరాలు, చెవి ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు హత్య, దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ బి. నరహరి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడింది. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుల గుర్తింపుపై దృష్టి సారించారు.
దర్యాప్తులో భాగంగా, మృతురాలి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న రజితపై అనుమానం రావడంతో పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో రజిత, ఆమె భర్త నర్సింగ్‌లను గంజ్ పాఠశాల సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా, నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!

