గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వరకట్న వేధింపుల కారణంగా 1,304 మంది మహిళలు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. 2019 నుండి 2023 వరకు నమోదైన కేసుల వివరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు.
టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ గణాంకాలను సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో 526, తెలంగాణలో 778 వరకట్న మరణాలు ఈ కాలంలో నమోదైనట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వరకట్న వేధింపుల కేసులలో శిక్షల ఖరారు రేటు ఆంధ్రప్రదేశ్‌లో 11.5%గా, తెలంగాణలో 14.4%గా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ గణాంకాలు కేసుల దర్యాప్తు మరియు న్యాయ ప్రక్రియలో ఉన్న లోపాలను సూచిస్తున్నాయి.











