హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో అమెరికాకు చెందిన 41 ఏళ్ల వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మిచెల్ బ్రయాన్ లీగా గుర్తించిన మృతుడిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని అధికారులు తెలిపారు.
గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. మృతుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రయాన్ లీ అని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మిచెల్ బ్రయాన్ లీ తన వ్యాపార భాగస్వామితో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఇద్దరూ గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో బస చేశారు.
ఆ తేదీ సాయంత్రం నుంచి లీ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో ఆ సాయంత్రం సుమారు 6.30 గంటలకు మాస్టర్ కీతో గదిని తెరిచారు. లోపల మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెంటనే స్పందించిన సిబ్బంది
వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆయన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హోటల్‌కు చేరుకుని పరిశీలన చేపట్టారు.

