తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రత, శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అనధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 48 మంది యాచకులను, 375 మంది హ్యాకర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు.
ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక తనిఖీలు బుధవారం జరిగాయి. యాచకులు, అనధికారికంగా సేవలందిస్తున్న హ్యాకర్లపై పోలీసులు దృష్టి సారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తనిఖీల్లో భాగంగా, 48 మంది యాచకులను గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించే లేదా అనధికారికంగా వేడుకలు నిర్వహించే వారిపై ఈ చర్యలున్నాయి.











