లోకకల్యాణం, ప్రజలందరి సంక్షేమం, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్ నుంచి శబరిమల వరకు 30 మంది అయ్యప్ప స్వాములు 44 రోజుల మహా పాదయాత్ర చేపట్టారు. హిందూరి శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర పేరుతో ఈ యాత్ర కొనసాగుతోంది.
ఈ యాత్రలో స్వాములు భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజూ ఉదయం అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిత్యం ఇదే విధానంలో యాత్రను కొనసాగిస్తున్నారు. స్వాముల వెంట వంట సామగ్రి, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన లగేజీ వాహనం కూడా ప్రయాణిస్తోంది. యాత్రలో పాల్గొనే స్వాముల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక వైద్యుడు అందుబాటులో ఉంటూ, అవసరమైన మందులు, వైద్య సదుపాయాలను అందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
44 రోజుల పాటు సాగే ఈ మహా పాదయాత్రలో భాగంగా బుధవారం స్వాములు కామారెడ్డికి చేరుకుని దీక్షా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి జంగంపల్లిలో పూజలు నిర్వహించి విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం మరుసటి రోజు యథావిధిగా పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈ పాదయాత్రకు నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ప్రకాష్, ఆగమయ్య గురుస్వామి, ఇతర గురుస్వాములు సహకారం అందిస్తున్నారని యాత్రలో పాల్గొన్న స్వాములు తెలిపారు. లోకకల్యాణం కోసం, ధర్మం మరింత విస్తరించాలని సంకల్పంతో శబరిమల యాత్రను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.












