కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, శ్రీశైలం దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ మర్యాదల ప్రకారం కాణిపాక ఆలయ అధికారులు, అర్చకులు శ్రీశైలం దేవస్థానం ప్రతినిధులకు స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం శ్రీశైలం దేవస్థానం చైర్మన్ నాగేశ్వర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.






