జిల్లా రాజంపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈఓ సుబ్బారెడ్డి పూజారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని భక్తులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భక్త మండలి, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అపచారం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవస్థాన ఈఓ సుబ్బారెడ్డి ఆలయ పూజారి పట్ల అమర్యాదగా, అసభ్యకర పదజాలంతో మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయానికి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులను సాకుగా చూపి, పూజారి ఒక బ్రాహ్మణుడు అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా, కొత్త బిచ్చగాళ్లు, చిల్లరగాళ్ల వంటి మాటలు విని దూషించారని స్థానికులు చెబుతున్నారు.
భక్తుల ఆవేదన
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేవుడికి సేవ చేసే పూజారినే ఇలా అవమానించడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అంటే భక్తి, గౌరవం, సంప్రదాయానికి నిలయం. అలాంటి చోట పూజారినే అసభ్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

