హిమాలయాల్లోని ప్రసిద్ధ చార్ధామ్ యాత్రకు రంగం సిద్ధమైంది. పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల దర్శనార్థం తెరవడానికి తేదీలను ప్రకటించారు.
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చార్ధామ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు భక్తుల దర్శనార్థం ఏప్రిల్ 22 మరియు 23 తేదీలలో తెరవనున్నాయి. ఈ మేరకు అధికారులు తేదీలను ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గంగోత్రి మరియు యమునోత్రి క్షేత్రాలు యాత్రికులకు ఏప్రిల్ 19వ తేదీ నుంచే అందుబాటులోకి రానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన ఓంకారేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఆలయాల ప్రారంభ తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు.












