దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్లో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేపట్టారు.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పూజా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఏలేటి మహేశ్వర్రెడ్డి నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సంప్రదాయబద్ధంగా పూజలు చేపట్టిన అనంతరం అమ్మవారికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నవరాత్రి ప్రాముఖ్యత
నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో లక్ష పుష్పార్చనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తితో పుష్పాలను సమర్పిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భక్తులు ప్రార్థించారు.












