2026 విశ్వావసు నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాధ్యతలు పెరిగే కాలంగా గోచార రీత్యా సూచిస్తోంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ ఏడాది శని ప్రభావం వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరిగినప్పటికీ, గురు గ్రహ అనుగ్రహం వల్ల అనుకున్న పనులు పట్టుదలతో సాధించే అవకాశం ఉంది. ఆర్థిక, వృత్తి, ఆరోగ్య రంగాలలో ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు పరిహారాలు ఇక్కడ ఉన్నాయి.
ఆర్థికంగా చూస్తే, ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, అష్టమ శని ప్రభావం వల్ల ధనం అనవసరంగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అత్యవసరం. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఎవరికీ హామీ ఉండకూడదు. అనవసర ప్రయాణాలు లేదా ఆరోగ్య కారణాల వల్ల ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వృత్తి, వ్యాపారాల పరంగా, ఉద్యోగస్థులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. నిబద్ధతతో పని పూర్తి చేయడం వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో పోటీ పెరిగినప్పటికీ, కొత్త మార్గాల ద్వారా లాభాలు గడించే అవకాశం ఉంది. కాంట్రాక్టు పనులు చేసే వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులు వసూలవుతాయి.










