2026 విశ్వావసు నామ సంవత్సరం మీన రాశి వారికి బాధ్యతలు పెరిగే కాలంగా గోచార రీత్యా సూచిస్తోంది. ఏలినాటి శని ప్రారంభ దశ నడుస్తున్నందున, పట్టుదల, నిగ్రహం అవసరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య రంగాలపై ఈ సంవత్సరం ప్రభావం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.
ఆర్థికంగా, ఆదాయ మార్గాలు బాగున్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంటి మరమ్మత్తులు, శుభకార్యాల కోసం ధనం అధికంగా వ్యయమవుతుంది. భారీ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న రంగాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటేనే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వృత్తిపరంగా, ఉద్యోగస్తులు పని ఒత్తిడిని, సహోద్యోగుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే, నిబద్ధతతో పనిచేస్తే జూన్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. వ్యాపారస్తులకు మార్పులు, విస్తరణ ప్రయత్నాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కాంట్రాక్టు పనులు చేసేవారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులు వసూలవుతాయి.










