చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామ నవమి, శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. పురాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ పవిత్ర దినాన కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.
శ్రీరామ నవమి రోజున, తెల్లవారుజామున స్నానానంతరం 'శ్రీ సీతారామ చంద్రమూర్తుల అనుగ్రహం కోసం' అని సంకల్పం చేసుకోవాలి. గృహంలో శ్రీరాముని ఫోటో లేదా విగ్రహానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి, దీపం వెలిగించి పూజ నిర్వహించాలి. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్మకం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆలయాల్లో లేదా ఇళ్లలో సీతారాముల కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సందర్భంగా పానకం, వడపప్పు, చలిమిడి లేదా పాయసం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం. రామాయణ పారాయణం, ముఖ్యంగా బాలకాండలో శ్రీరాముని జనన ఘట్టాన్ని చదవడం లేదా 'శ్రీరామ రక్షా స్తోత్రం', 'రామ నామ జపం' చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని చెబుతారు.










