జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, మైలవరం ఎ.పి రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులకు భద్రత, స్వీయ-రక్షణ, బాల్య వివాహ నివారణ, మహిళా భద్రత, 'శక్తి' యాప్ వినియోగం, మరియు అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.
జమ్మలమడుగు రూరల్ సి.ఐ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. హాస్టల్‌ను సందర్శించిన సి.ఐ, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హాస్టల్ వార్డెన్‌కు సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, స్వీయ-రక్షణ పద్ధతులు, బాల్య వివాహాల నివారణ, మహిళా భద్రత, 'శక్తి' యాప్ వినియోగం గురించి విద్యార్థినులకు ప్రత్యేకంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే డయల్ 112 మరియు మహిళా హెల్ప్‌లైన్ 1090 నంబర్ల గురించి కూడా తెలియజేశారు.












