జమ్మలమడుగు రూరల్ సి.ఐ కుళ్లాయప్ప ఆదేశాల మేరకు, మైలవరం ఎ.పి రెసిడెన్షియల్ స్కూల్ బాలికల హాస్టల్లో విద్యార్థినులకు భద్రతా చర్యలు, వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
బుధవారం సాయంత్రం హాస్టల్‌ను సందర్శించిన రూరల్ సి.ఐ కుళ్లాయప్ప, విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్‌కు విద్యార్థుల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా, స్వీయ రక్షణ, బాల్య వివాహ నివారణ, మహిళా భద్రత, 'శక్తి' యాప్ వినియోగం, అత్యవసర సేవలైన డయల్ 112, 1090 మహిళా హెల్ప్‌లైన్ గురించి విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.
విద్యార్థుల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సి.ఐ కుళ్లాయప్ప భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మైలవరం ఎస్.ఐ డా. శ్యాం సుందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.












