ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) కన్నుమూశారు. ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు గాయమై ఆయన మరణించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, కాంటే, కాబిల్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన సంజయ్ గుప్తా మరణవార్తను దర్శకుడు అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇంట్లో తలకు గాయం కావడంతో ఆయన మరణించినట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదానికి దారితీసిన సంఘటన
సంజయ్ గుప్తా సన్నిహితుడు హనీఫ్ చునావాలా తెలిపిన వివరాల ప్రకారం, ఆయన రాత్రి సమయంలో బాత్రూమ్లో జారిపడి తలకు గాయమైంది. ఈ ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.






