తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025' ప్రధానోత్సవ వేడుక నిన్న (మార్చి 19, 2026) ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ వేడుకలో సినీ రంగంలోని వివిధ విభాగాల్లో విజేతలకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు మరియు భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గానూ పలువురు దిగ్గజాలకు గౌరవ పురస్కారాలు లభించాయి. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి, పైడి జైరాజ్ అవార్డు కమల్ హాసన్‌కు, అక్కినేని నాగేశ్వరరావు (ANR) అవార్డు జయసుధకు, బీఎన్ రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావుకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్వనీ దత్‌కు, కాంతారావు అవార్డు ఆర్. నారాయణమూర్తికి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్‌కు, సి. నారాయణరెడ్డి (సినారె) అవార్డు సుద్దాల అశోక్ తేజకు దక్కాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సినిమా విభాగంలోనూ పలువురు ప్రతిభావంతులకు అవార్డులు ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా 'రాజు వెడ్స్ రాంబాయి' ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) అవార్డులు గెలుచుకున్నారు. సాయిలు కాంపాటి 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే, ఉత్తమ ద్వితీయ చిత్రంగా 'దండోరా' నిలిచింది.











