నటి సాయిపల్లవి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలను వివరించారు. మంచి మనసుతో పాటు, తనను తాను విశ్లేషించుకునే పరిణతి ముఖ్యమని తెలిపారు.
తన సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న కథానాయిక సాయిపల్లవి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో రామాయణ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఆమె.. తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్, రవి దూబే కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారని అమితాబ్ బచ్చన్ ప్రశ్నించగా, సాయిపల్లవి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముందుగా అతడు మంచి మనిషి అయి ఉండాలని చెప్పారు. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కాకూడదని, తన ప్రవర్తనను తాను పరిశీలించుకునే స్వభావం ఉండాలని పేర్కొన్నారు.












