ప్రముఖ చిత్రనిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకులు ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మృతి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించిన ఆర్.బి. చౌదరి, సినీ రంగంలో సుపరిచితులు. ఆయన కుమారుడు నటుడు జీవా.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
'సూర్యవంశం', 'రాజా', 'నువ్వు వస్తావని', 'సుస్వాగతం', 'నిన్నే ప్రేమిస్తా' వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.












