ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఇష్టాలు, అయిష్టాలపై గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నటిగా ఉండటంలోని ప్రయోజనాలు, ప్రజల ఊహల గురించి ఆమె మాట్లాడారు.
నటిగా కొనసాగడంలో ఉన్న ప్రయోజనాలను ప్రస్తావిస్తూనే, ప్రజలు తమ గురించి అవాస్తవాలను ఊహించుకోవడమే అత్యంత ఇబ్బందికరమని త్రిష పేర్కొన్నారు. ఇది నటీనటులు ఎదుర్కొనే ఒక సవాలు అని ఆమె అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తనకు బటర్ స్కాచ్ హెయిర్ కలర్ అంటే ఇష్టమని, న్యూయార్క్ తన అభిమాన హాలిడే స్పాట్ అని, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలంటే ఆసక్తి అని త్రిష తెలిపారు. జంతువుల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ, ఏ జాతి పట్ల కూడా అయిష్టం లేదని, కొమోడో డ్రాగన్‌ను పెంపుడు జంతువుగా కోరుకుంటానని వెల్లడించారు.










