జిల్లా రాజంపేట పట్టణంలో పారిశుధ్య సమస్యలు తీవ్రమయ్యాయి. చెత్తాచెదారం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, రోడ్లపై ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఫ్లెక్సీ కూలి గాయాలైన ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాజంపేట పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడంతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాంధీ విగ్రహం నుంచి పాత బస్టాండ్ మున్సిపల్ కాంప్లెక్స్ వరకు రోడ్ల వెంబడి దుకాణాలు రోడ్లపైకి విస్తరించాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పాదచారులు రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది.












