మురసు తుపాను కారణంగా కడప జిల్లాలో అతివేగంతో పెనుగాలులు వీచే ముప్పు ఉందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలవవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రహదారులపై పొంగి ప్రవహించే వాగులు, కాలువలు దాటే సాహసం ఎవరూ చేయరాదని ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు ఆదేశాలు
నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే ఆపాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. మండల అధికారులతో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకోవాలని, క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపాలని ఎస్పీ ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అత్యవసర సహాయం కోసం ప్రజలు వెంటనే డయల్ 112ను సంప్రదించాలని ఎస్పీ కోరారు.

