నంద్యాల, జూన్ 29
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ఓ హోటల్లో చికెన్‌లో బొద్దింక కనిపించిందని వినియోగదారుడి ఫిర్యాదుతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వంటగది పరిశుభ్రత, ఆహార నిల్వ, నాణ్యత, సిబ్బంది పరిశుభ్రత, లైసెన్స్‌లు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలుపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ఓ హోటల్లో విక్రయించిన చికెన్‌లో బొద్దింక కనిపించిందని వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు ఆకస్మికంగా హోటల్‌ను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట నాణ్యత, సిబ్బంది పరిశుభ్రత, హోటల్ లైసెన్స్‌లు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు.











