తిరువనంతపురం, 30 అక్టోబర్ 2026
భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రాహింద్2026 విజయవంతంగా ముగిసింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ నెల 21 నుంచి 31 వరకు జరిగిన ఈ విన్యాసాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 6వ అధ్యాయం ప్రకారం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విన్యాసాల్లో భాగంగా అడవులు, దీవులు, తీర ప్రాంతాల్లో సైనిక బలగాలు విస్తృత స్థాయిలో సంయుక్త కార్యకలాపాలు చేపట్టాయి. సముద్రం, గాలి మార్గాల ద్వారా సైనికులను దించడం, తీర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం, నౌకాశ్రయాల భద్రతను కాపాడటం వంటి విన్యాసాలు నిర్వహించారు.












