ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియా, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల నాయకులతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ శాంతి, భద్రత, భారతీయ పౌరుల సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరిపారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో జరిగిన సంభాషణలో, ఆ దేశంపై జరిగిన దాడులను ప్రధాని మోడీ ఖండించారు. ఇవి సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే చర్యలని పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం త్వరితగతిన పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను ఇరుపక్షాలు గుర్తించాయని ప్రధాని తెలిపారు. కష్టకాలంలో భారతీయ సమాజం సంక్షేమాన్ని చూసుకున్నందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బహ్రెయిన్ రాజు హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో మాట్లాడుతూ, బహ్రెయిన్‌పై జరిగిన దాడులను ప్రధాని ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారతదేశం బహ్రెయిన్‌తో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అక్కడి భారతీయ సమాజానికి రాజు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.











