పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల కారణంగా నిలిచిపోయిన దుబాయ్, అబుదాబి నుంచి భారత్‌కు విమాన సేవలు నిన్న రాత్రి పునఃప్రారంభమయ్యాయి. దీనితో యూఏఈలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులకు ఊరట లభించింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు బయలుదేరాయి. రోజుల తరబడి నిలిచిపోయిన ఈ విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుబాయ్ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో, దుబాయ్ విమానాశ్రయాలు పరిమితంగా విమాన కార్యకలాపాలను నిన్న సాయంత్రం పునఃప్రారంభించినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు దుబాయ్ వరల్డ్ సెంట్రల్ - అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ (DWC) విమానాశ్రయాల నుంచి కొద్ది సంఖ్యలో విమానాలకు అనుమతి లభించింది.











