ప్రతి ఏడాది వేల కిలోమీటర్లు వలస వెళ్లే మోనార్క్ సీతాకోకచిలుకల ప్రయాణ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిశోధన చేపట్టారు. ఇందుకోసం దాదాపు 1,750 సీతాకోకచిలుకలకు అతి చిన్న, సౌరశక్తితో పనిచేసే రేడియో ట్రాకర్లను అమర్చారు. వీటి ద్వారా అవి ప్రయాణించే మార్గాలు, విశ్రాంతి ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నీటి బిందువుతో సమానమైన బరువు కలిగిన ఈ ట్రాకర్లు, సీతాకోకచిలుకల శరీరంపై అమర్చిన తర్వాత ప్రత్యేక రిసీవర్ల ద్వారా వాటి కదలికలకు సంబంధించిన సంకేతాలను పంపిస్తాయి. ఈ వివరాలను ప్రజలు కూడా ప్రాజెక్ట్ మోనార్క్ సైన్స్ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పరిశోధనలో వెల్లడైన విషయాలు
ప్రాథమిక పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని ఉటా, ఫ్లోరిడా ప్రాంతాల నుంచి బయలుదేరిన కొన్ని తూర్పు ప్రాంత మోనార్క్ సీతాకోకచిలుకలు మెక్సికోకు చేరుకున్నట్లు గుర్తించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు సుమారు 175 ట్రాకర్లు అమర్చిన సీతాకోకచిలుకలు మెక్సికోలో గుర్తించబడ్డాయి.












