దిబ్రూగఢ్, 7 నవంబర్ 2026
అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన చమురు నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడు, భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన చమురు నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడు, భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో గాయపడిన మరో కార్మికుడు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందడంతో మరణాల సంఖ్య రెండుకు చేరింది. మరో ముగ్గురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 9.05 గంటలకు దిబ్రూగఢ్ జిల్లాలోని తెంగాఖాట్ ప్రాంతంలో ఉన్న ఆయిల్ ఇండియా ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫామ్‌లో ఈ ప్రమాదం జరిగింది. నిర్వహణ పనులు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.









