భారత రక్షణ రంగంలో మరో కీలక విజయం నమోదైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ () రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ప్రళయ్ క్వాసీ-బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది.
ఉదయం సుమారు 11:10 గంటలకు చేపట్టిన ప్రయోగంలో, నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి విజయవంతంగా చేరుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ పరీక్షలో వివిధ రేంజ్ పరికరాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రయోగం విజయవంతమైనట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్షిపణి అభివృద్ధి
ప్రళయ్ క్షిపణిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్తో పాటు ఇతర ప్రయోగశాలలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి ఆధునిక మార్గదర్శక, నావిగేషన్ వ్యవస్థలను కలిగి ఉండటంతో పాటు, విమాన ప్రయాణ సమయంలో తన మార్గాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.












