బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి గుమ్మం వద్ద దీపం సమీపంలోకి లీకైన గ్యాస్ చేరడంతో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. డెలివరీ కార్మికుడి అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటికి సిలిండర్ తీసుకెళ్లిన డెలివరీ కార్మికుడు దానిని గుమ్మం వద్ద ఉంచుతుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఇంటి యజమాని గుమ్మం వద్ద పూజ అనంతరం వెలిగించిన నూనె దీపం వద్దకు సిలిండర్ నుంచి లీకైన గ్యాస్ చేరడంతో మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వ్యాపించగానే డెలివరీ కార్మికుడు అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సిలిండర్లను బహిరంగ మంటలు, దీపాల సమీపంలో ఉంచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











