ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాలుష్య సమస్యపై సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం, సంప్రదాయ పద్ధతులకు మారాలని సూచించింది. ఢిల్లీ గాలి నాణ్యత సూచీ 389గా నమోదై అత్యంత పేలవమైన స్థాయికి చేరింది.
ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, సంప్రదాయ పద్ధతులకు తిరిగి ఎందుకు వెళ్లకూడదని ఆయన ప్రశ్నించారు. దీపావళి సమయంలో టపాసుల వినియోగాన్ని తగ్గించి, గతంలో మాదిరిగా దీపాలు వెలిగించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. పంట వ్యర్థాలను కాల్చకుండా రైతులకు ముందుగానే గిట్టుబాటు ధర ప్రకటించాలని, గ్రామ పంచాయతీలకు వాటిని సేకరించే యంత్రాలు, అవసరమైన సదుపాయాలు కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొంది. ఢిల్లీఎన్సీఆర్ ప్రాంతంలో వాహనాల రద్దీ, ప్రజా రవాణా కొరత కూడా కాలుష్యానికి ప్రధాన కారణాలని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక అవసరమని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ గాలి నాణ్యత సూచీ () 389గా నమోదై అత్యంత పేలవమైన స్థాయికి చేరింది. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





