ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం చలో ఢిల్లీ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ () ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పోలీసు, పారా మిలటరీ బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రజలు స్థానిక వ్యాపారులకు కూడా మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు. దీపావళి, ఛఠ్ పూజ, భాయ్ దూజ్ పండుగల సందర్భంగా స్థానిక చిన్న వ్యాపారుల వద్ద వస్తువులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.












