దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో న కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోలేదని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ర్యాలీకి అనుమతి రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలీసుల నుంచి అనుమతి కొనసాగుతోందని, ర్యాలీ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలో న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.






