దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ () 2,600 అదనపు బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. నుంచి 8 వరకు, అలాగే పండుగ అనంతరం , 11 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
బెంగళూరులోని కెంపేగౌడ బస్‌స్టేషన్, మైసూరు రోడ్ బస్‌స్టేషన్, శాంతినగర్ నుంచి అదనపు బస్సులు బయలుదేరనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కలిగిన బస్సులు విజయనగర్, యశ్వంత్‌పూర్, జయనగర్ తదితర ప్రాంతాల నుంచి కూడా నడుస్తాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రయాణ గమ్యస్థానాలు
ఈ ప్రత్యేక బస్సులు కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి, శివమొగ్గ, హుబ్బళి, బెలగావి, మైసూరు, మడికేరి వంటి నగరాలకు వెళ్తాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, తమిళనాడు, కేరళలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, తిరుచ్చి, ఎర్నాకులం, కోజికోడ్ వంటి ప్రాంతాలకు కూడా సర్వీసులు నడుస్తాయి.
అదనపు బస్సుల వివరాలు
ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఒకే రిజర్వేషన్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది టికెట్లు బుక్ చేసుకుంటే 5 శాతం రాయితీ లభిస్తుంది. వెళ్లే ప్రయాణం, తిరుగు ప్రయాణం టికెట్లను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణ టికెట్‌పై 10 శాతం రాయితీ పొందవచ్చు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

