దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యంలో 50 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సాధించాలన్న లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2030 నాటికి సాధించాల్సిన ఈ లక్ష్యాన్ని 2025లోనే అందుకున్నామని ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో నిర్వహించిన భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో2026 ప్రారంభోత్సవంలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. భారత్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం సుమారు 559 గిగావాట్లకు చేరగా, అందులో 308 గిగావాట్లకు పైగా శిలాజేతర ఇంధన వనరుల నుంచి వస్తోందని నివేదికలు వెల్లడించాయి. ఇందులో సౌర, పవన, జలవిద్యుత్, అణు విద్యుత్ వంటి వనరులు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యం
2030 నాటికి శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడమే తమ లక్ష్యమని మోదీ తెలిపారు. రాబోయే 10 నుంచి 11 ఏళ్లలో అదనంగా మరో 500 గిగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని భారత్ ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన చెప్పారు. ఈ లక్ష్యం సవాలుతో కూడుకున్నదైనా, దేశ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.












