బెంగళూరు సమీపంలో గృహ నిర్మాణ సహకార సంఘం కోసం కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. చట్టబద్ధమైన పథకం, లేఅవుట్ ప్రణాళిక లేకుండా భూములను సేకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో భూ యజమానులకు ఊరట లభించింది.
భూసేకరణ ప్రక్రియలో మోసం, అధికార దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, భూముల స్వాధీనాన్ని తిరిగి అసలు యజమానులకు అప్పగించాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
59 ఎకరాల వివాదం
బెంగళూరు ఉత్తర తాలూకాలోని నెలకదరనహళ్లి గ్రామ పరిధిలో ఉన్న 59 ఎకరాల 6 గుంటల భూమిని ఒక సహకార గృహ నిర్మాణ సంఘం కోసం కర్ణాటక ప్రభుత్వం సేకరించింది. 1922లో ప్రాథమిక భూసేకరణ నోటిఫికేషన్ జారీ కాగా, 1924లో తుది ప్రకటన వెలువడింది. ఈ ప్రక్రియను భూ యజమానులు కోర్టులో సవాలు చేశారు. భూసేకరణ వెనుక ప్రజాప్రయోజనం లేదని, ప్రైవేటు మధ్యవర్తి ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని భూములను సేకరించారని వారు ఆరోపించారు.












