చిత్తూరు, 7 నవంబర్ 2026
ఆంధ్రప్రదేశ్‌లో మరో విమానాశ్రయ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం వద్ద ప్రతిపాదించిన విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విమానాశ్రయం కోసం మొత్తం 1,788 ఎకరాల భూమిని గుర్తించగా, ఇప్పటివరకు 1,300 ఎకరాలు సేకరించినట్లు సమాచారం. ప్రాజెక్టు తొలి దశకు సుమారు రూ.734 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు దశల్లో అభివృద్ధి చేస్తే మొత్తం వ్యయం రూ.1,142.10 కోట్లకు చేరనుంది.
నిధుల కేటాయింపు, విధానంపై పరిశీలన
భూసేకరణ కోసం రూ.198.75 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.146 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. విమానాశ్రయాన్ని ప్రభుత్వ యాజమాన్యంలో అభివృద్ధి చేయాలా లేక ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య () విధానంలో నిర్మించాలా అనే అంశంపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండు విధానాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తుది నమూనాను ఖరారు చేసిన తర్వాత కేంద్రానికి తెలియజేసి, నిర్మాణ సంస్థ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.

