ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినప్పుడు, నిందితులు ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, వారికి బెయిల్ మంజూరు చేయాలని ముందుగానే షరతులు విధిస్తూ ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒడిశా హైకోర్టు ఒక హత్య కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే అదే సమయంలో నిందితులు ట్రయల్ కోర్టులో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
అంతేకాకుండా, ట్రయల్ కోర్టు నిందితులకు హైకోర్టు విధించిన షరతుల ప్రకారం సాధారణ బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా ధర్మాసనం విచారించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత, నిందితులు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలో హైకోర్టు నిర్దేశించకూడదని ధర్మాసనం పేర్కొంది. సాధారణ బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేది ట్రయల్ కోర్టు స్వతంత్రంగా నిర్ణయించాలని, ట్రయల్ కోర్టు పరిశీలించాల్సిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ముందుగానే షరతులు విధించకూడదని స్పష్టం చేసింది. బెయిల్ దరఖాస్తును చట్టప్రకారం, కేసులోని అంశాలను పరిశీలించి నిర్ణయించే స్వేచ్ఛ ట్రయల్ కోర్టుకు ఉండాలని వ్యాఖ్యానించింది.












