బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తమిళనాడులో వాతావరణం తీవ్రంగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో సోమవారం మొత్తం 11 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రద్దయిన విమానాలలో ఐదు బయలుదేరాల్సినవి కాగా, ఆరు చెన్నైకి రావాల్సినవి. చెన్నై నుంచి విజయవాడ, కడప, రాజమండ్రి, తిరుచ్చి ప్రాంతాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విజయవాడ నుంచి చెన్నైకి వచ్చే రెండు విమానాలు, చెన్నై నుంచి విజయవాడకు వెళ్లే ఒక విమానాన్ని రద్దు చేశారు. అలాగే రాజమండ్రి, కడప, తిరుచ్చి మార్గాల్లోనూ విమాన సర్వీసులపై ప్రభావం పడింది.
అధికారుల ప్రకటన
తుపాను కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. రద్దయిన విమానాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మురసు తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

