ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడం, వినియోగించడం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులో భాగమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పిల్లలను ఇంటర్నెట్ వినియోగం నుంచి పూర్తిగా దూరం చేయడం ఆన్లైన్లో ఎదురయ్యే ప్రమాదాలకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది. ఈ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)() కింద రక్షణ పొందుతుందని తెలిపింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అభ్యంతరకర కంటెంట్ సోషల్ మీడియా వేదికల్లో వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పిల్లల భద్రత, వారి స్వేచ్ఛ రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని ధర్మాసనం పేర్కొంది. ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు విద్య, సమాచారం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రయోజనాలు అందుతున్నాయని వివరించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి డిజిటల్ ప్రాప్యత ఎంతో ఉపయోగకరమని తెలిపింది.
ఆన్లైన్లో అభ్యంతరకర కంటెంట్‌ను సృష్టించే, పంచుకునే వ్యక్తులు, వాటిని గుర్తించి తొలగించడంలో విఫలమయ్యే డిజిటల్ వేదికలదే బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. వారి తప్పులకు పిల్లలను ఇంటర్నెట్కు దూరం చేయడం సరైన విధానం కాదని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!

