కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టింగ్ ఆపరేషన్ కేసులో ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ కొనుగోలు, దాని బదిలీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టయిన రితేష్ పాండే విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ ప్రసాద్ సూచనల మేరకు రితేష్ పాండే, వినోద్ శర్మ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం ఆ ఫోన్‌ను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి అధికారిక నివాసానికి తీసుకెళ్లి, అక్కడ ఉన్న ప్రజ్వల్ ప్రసాద్‌కు అందజేసినట్లు రితేష్ పాండే తన వాంగ్మూలంలో పేర్కొన్నారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ వివరాలను పోలీసులు ఇంకా ధృవీకరిస్తున్నారు.












