ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా ప్రజా సమస్యలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు ముందుకు వెళ్లకుండా నిలువరించేందుకు వాటర్ క్యానన్లతో నీటిని చిమ్మారు.
గైర్సైన్లోని అసెంబ్లీ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేశ్ గోడియాల్ నేతృత్వంలో ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రధాన సమస్యలు
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, రాష్ట్రం నుంచి ప్రజల వలసలు, మహిళల భద్రత, అంకితా భండారీ హత్య కేసులో న్యాయం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.












